Digital Kasipet:-
కాసిపేట మండలంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఇందిరమ్మ దేశానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, గోలేటి స్వామి, కొత్త రమేష్ ,పుర్ర పోషం, సిద్ధం రవి, పొట్టబత్తుల సంపత్, దుర్గం క్రాంతి, నందికొండ శ్రీధర్, కుర్మ నర్సయ్య పాల్గొన్నారు.