Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం - రామగుండం సీపీ

Digital Kasipet:- 
మంచిర్యాల జిల్లా  దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం  మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఒరియాంట్ సిమెంట్ ఫ్యాక్టరీ శివకాంత్ పాండే, ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు.  ముఖ్య అతిథులతో కలిసి సీపీ గారు వైద్య శిబిరం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల  కోసం, భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటామన్నారు. వృద్దులకు సీపీ గారి చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపు కి వచ్చే ప్రజలకు వాహనాలను,   భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App