Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో కార్డాన్ &సెర్చ్... వాహనాలు, గుడుంబా స్వాధీనం

Digital Kasipet:- 
దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండా మరియు కొనురు గ్రామాల్లో పోలీసులు  కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాలలో ఎలాంటి పేపర్లు లేని  45బైక్ లు, 6ఆటో లు మరియు 70లీటర్ ల వాష్, 4లీటర్ ల గుడుంబా సీజ్ చేసారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేష్ మాట్లాడుతూ పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను  కొనుగోలు చేయవద్దని తెలిపినారు. గ్రామాలలోని ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కాలు అమ్ముతున్నా కలిగి ఉన్న వారి సమాచారం తెలియజేయాలన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం పడుతుందని, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ లు ప్రమోద్ రావు , జగదీష్, బాబురావు, రాజు, దేవాపూర్ ఎస్ఐ విజేందర్ రెడ్డి, మందమరి ఎస్ఐ భూమేష్, కాసిపేట ఎస్ఐ నరేష్, తాండూర్ ఎస్ఐ కిరణ్, రామకృష్ణాపూర్ ఎస్ఐ సంజీవ్ లు, PSI లు మరియు బెల్లంపల్లి సబ్ డివజన్ సిబ్బది ఇంకా స్పెషల్ పార్టీ మొత్తం 77మంది  వరుకు సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App