Digital Kasipet:-
రోడ్డు ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వయంగా దగ్గర ఉండి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి, సోమగూడెం రహదారి మధ్య గల స్టేషన్ పెద్దనపల్లి ఆర్ఎస్ వైన్స్ వద్ద కాగజనగర్ నుంచి బైక్ పై వస్తూ ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. దింతో అటుగా వెళ్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించి వాహనాన్ని ఆపి గాయలైన వారిని వెంటనే దగ్గర ఉండి క్షతగాత్రులను అంబులెన్సు లో తరలించారు. దింతో పాటుగా తన ఎస్కార్ట్ వాహనాన్ని సైతం అంబులెన్సు వెంట పంపించారు.