Digital Kasipet:-
తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో మండల కేంద్రములోని ఎంపీడీఓ కార్యాలయం ముందు బతుకమ్మ సంబరాలు నిర్వహించగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలిసేలా బతుకమ్మను విశ్వవ్యతంగా నిర్వహించడం సంతోషకరంగా ఉంది అన్నారు. ప్రకృతి లో భగవంతుణ్ణి పూలతో పూజిస్తారు, ఆ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సమాజానిదాని అన్నారు. మహిళా సాధికారికత కోసం తెలంగాణ జాగృతి కృషి అభినందనీయమని తెలిపారు. జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు మాట్లాడుతూ జిల్లాలో జాగృతి ని బలోపేతం చేస్తున్నామని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు, చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆతితులుగా ఎంపీపీ రొడ్డ లక్ష్మి, కో కన్వీనర్ మద్ది లక్ష్మణ్, సాహితి అధ్యక్షులు దుర్గం రాజేశం గౌడ్ నియోజకవర్గ కో కన్వీనర్ లవుడియా శ్రీనివాస్, జిల్లా నాయకులు ప్రకాష్, మండల అధ్యక్షులు సోదారి సురేష్, మహిళా మండల అధ్యక్షురాలు బద్ది సుగుణ, అధికరప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్, కోశాధికారి కనక వంశీ కృష్ణ, కో కన్వీనర్ పలాగని గంగ, కార్యదర్శి అట్ల మల్లేష్, కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్, ముత్యంపల్లి జీపీ అధ్యక్షులు కనుకుంట్ల హరీష్, చిన్నదర్మరం జీపీ అధ్యక్షులు సూరం వినోద్ కుమార్, ముత్యంపల్లి జీపీ మహిళా అధ్యక్షురాలు పెద్దపల్లి శ్రీవాణి, మహిళలు పాల్గొన్నారు.