Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెరాస పార్టీ విజయ గర్జన సభను విజయవంతం చేయాలనీ పిలుపు

Digital Kasipet:- 
మండలంలోని కాసిపేట గ్రామంలో కాసిపేట తెరాస పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు అగ్గి సత్తయ్య అధ్యక్షతన తెరాస పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ప్రెసిడెంట్ పుస్కూరి విక్రంరావు మాట్లాడుతూ 15న తెరాస పార్టీ విజయ గర్జన సభకు గ్రామ కమిటి, అనుబంధ కమిటి నాయకులు, క్రీయాశీల కార్యకర్తలను భారీగా సభకు తరలించాలని అన్నారు. ముఖ్య మంత్రి చేస్తున్నా అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధారావత్ దేవి, ఎంపీటీసీ అక్కెపెల్లి లక్ష్మి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, కార్యదర్శి మొటూరి వేణు, తెరాస మండల నాయకురాలు అరే సునీత, టిబిజికెఎస్ నాయకులు మేడ సమ్మయ్య,  భూమన్న, రమేశ్, వార్డ్ మెంబర్లు జమున శంశీర్, రేణుక తెరాస లీడర్స్ బుగ్గ రాజు, రాంచెధర్ గోపాల్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App