Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న లారిని ఆటో ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కాసిపేట ఎస్ఐ నరేష్ ప్రమాదంలో గాయపడ్డ మహిళను హాస్పత్రికి తరలించారు.