Digital Kasipet:-
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మండల ప్రజలకు కాసిపేట ఎస్ఐ నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేసారు. పండగను శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలన్నారు. మహిళలు విలువైన ఆభరణాలు వేసుకుంటే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సద్దుల బతుకమ్మ సందర్బంగా అందరూ బతుకమ్మ సంబురాలలో ఉంటే దొంగలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇంటివద్ద ఒకరు ఉండేలా చూసుకోవాలని అన్నారు. యువత మోటార్ సైకిల్ లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మరియు అతివేగంగా వెళ్ళకూడదని, ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, ఏ చిన్న సంఘటన జరిగిన పి.డి యాక్ట్ పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఎస్ఐ నరేష్ సూచించారు.