Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 2కె రన్

Digital Kasipet:- 
పోలీస్ అమరుల త్యాగాలకు గుర్తుగా 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించినట్లు కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేశ్ తెలిపారు. సోమవారం కాసిపేట పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం క్రీడా మైదానం నుంచి 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా క్రీడాకారులు, యువకులు, గ్రామస్తులు పెద్దా చిన్నా తేడా లేకుండా ఉత్సాహంగా 2కె రన్ లో పాల్గొన్నారు. అనంతరం ఎస్ఐ నరేశ్ మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. వ్యాయామం, పరుగు, నడకతో శారీరక దృఢత్వం ఉంటుందని, దింతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మానసిక ఉత్సాహంతో ఉంటారని కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేశ్ వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని, నడక, వ్యాయామం అందరికీ అవసరమన్నారు. 2రన్ లో పాల్గొని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట పోలీస్ సిబ్బంది, సోమగూడెం రన్నర్స్ & వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App