Digital Kasipet:-
కాసిపేట మండలంలోని బుగ్గగూడెం గ్రామంలో బుధవారం బడి మానేసిన పిల్లల గురించి గ్రామసభ నిర్వహించారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నందున ప్రతి విద్యార్ధికి పుస్తకాలు పంపిణి చేసినట్లు తెలిపారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి డౌట్స్ ని ఫోన్ కాల్ ద్వారా పరిష్కరిస్తునట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ రఘుపతి, వార్డ్ సభ్యులు రజిత, ఉపాధ్యాయులు రాంచందర్ పాల్గొన్నారు.