Digital Kasipet:-
గంజాయి, నిషేధిత పొగాకు, గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ హెచ్చరించారు. గురువారం కాసిపేట పోలీస్ స్టేషన్ లో కోమటిచేనుకు గ్రామానికి చెందిన రాజయ్యను గంజాయి విక్రయ కేసులో అరెస్టు చేసి రిమాండు కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎడ్ల మహేష్ మాట్లాడారు. రాజయ్య గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో కాసిపేట ఎస్ఐ, మండల తహశీల్దార్ తో కలసి బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. 250 గ్రాములు గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు. కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేష్ పాల్గొన్నారు.