Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని వెటర్నరీ హాస్పిటల్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేకుండా ప్రమాదకరంగా ఉంది. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ దట్టంగా మొక్కలు పెరిగి ఉండడంతో పశువులు విద్యుత్ ప్రమాదం భారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదమే శనివారం తృటిలో తప్పింది. గేదె దూడ మేత మేయడానికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇరుక్కుపోవడంతో స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సంఘటన స్థలానికి వచ్చి, స్థానికులతో కలిసి దూడెను బయటకి తీశారు.