Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన మోరే నారాయణ అనారోగ్యం తో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందరు. ఈ విషయం తెలిసిన ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య స్పందించి సీఎం సహాయ నిధి ద్వారా 22,000 రూపాయల CMRF చెక్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రమణా రెడ్డి, దేవాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్లూరీ మల్లేశ్, ఓరియంట్ కార్మిక గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి, తెరాస నాయకులు గడ్డం పుర్సోతం, అనంత్ రావు, బింగీ శ్రీనివాస్, రొడ్డ కిష్టయ్య, గ్రామ యూత్, ఎస్సీ, బీసీ కమిటీ అధ్యక్షులు కొత్త శ్రవణ్, గోనె రవీందర్, కొంగా విజయ్ పాల్గొన్నారు.