Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి - బెల్లంపల్లి ఏసీపీ

Digital Kasipet:- 
బెల్లంపల్లి ఏసీపీ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాసిపేట పోలీస్ స్టేషన్ ను ఏసిపి ఎడ్ల మహేష్ తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులని పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించలన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు పెడుతూ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. మహిళలను వేధింపులకు గురిచేస్తే 100 నంబర్ కు డయల్ చేస్తే తమ సిబ్బంది వచ్చి వెంటనే సమస్యను తెలుసుకొని వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా ప్రభావం వల్ల ఇన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించలేదని, ఇక ముందు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలన్నారు. వాహన తనిఖీ సమయంలో ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుకొని కచ్చితంగా చూపించాలని, లేకపోతే వారికి జరిమానా విధించడం జరుగుతుందన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App