Digital Kasipet:-
కాసిపేట తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మహిళలకు బతుకమ్మ అతి పెద్ద పండుగని ఆయన తెలిపారు. మహిళల మనోభావాలకు తగినట్లుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేసి వారిని గౌరవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం పెద్దన్న గా వ్యవహరిస్తూ పెళ్లి చేసుకున్న యువతులకు కళ్యాణ లక్ష్మి అందజేస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కు రెండు లక్షల ఇరవై ఒక్క వేల చీరలు కేటాయించిదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డు లక్ష్మి, వైస్ ఎంపీపీ మూసుకుని విక్రమ్ రావు, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ నీలా రామ్ చందర్, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, తహసీల్దార్ భూమేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, దుర్గం పోశం, ఎంపీటీసీ కొండ బత్తుల రాంచందర్ ,రోడ్డ రమేష్,వేణు, తిరుపతి రెడ్డి, రోడ్డ రమేష్, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.