Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలనీ పిలుపు

Digital Kasipet:-
తెలంగాణ జాగృతి కాసిపేట మండల శాఖ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయడంకోసం మండల కేంద్రములో కాసిపేట జాగృతి సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు హాజరయి కార్యక్రమం విజయవంతం కావడానికి పలు సూచనలు చేసారు. కాసిపేట MRO మరియు ఎంపీడీఓ లను కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.  మండల స్థాయిలో జరిగే ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోదారి సురేష్, జిల్లా కోశాధికారి మాడే మంతయ్య, జిల్లా కో కన్వీనర్ బండారి లస్మయ్య  శ్రీహరి, మండల కోశాధికారి కనక వంశీ కృష్ణ, అధిక ప్రధాన కార్యదర్శి గంగాధరి రాజ్ కుమార్, కో కన్వీనర్ చిక్రం రామ్ దాస్, కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్, ముత్యంపల్లి జీపీ అధ్యక్షులు కనుకుంట్ల హరీష్, చిన్నదర్మరం జీపీ అధ్యక్షులు సూరం వినోద్ కుమార్, నాయకులు, ఆత్రం అంజు, గేడం లక్ష్మణ్, భీమయ్య పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App