Digital Kasipet:-
నిర్మల్ జిల్లాలోని బైంసా లో ఆదివారం గుర్తుతేలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ద్వాంసం చేయడాన్ని కాసిపేట మండలంలోని దళిత, గిరిజన, బహుజన నాయకులు, అంబేద్కర్ వాదులు, సామాజిక చైతన్య వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.