Digital Kasipet:-
దేవాపూర్ ప్రాంతంలోని లారీ ట్రాన్స్ పోర్ట్స్ 1/70, PRSA ఏజెన్సీ చట్టాలను ఉల్లంగించి నిర్వహిస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఇట్టి ట్రాన్స్ పోర్ట్ లను తొలగించాలని మంగళవారం పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. లేని పక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.