Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో గాంధీ జయంతి వేడుకలు

Digital kasipet:- 
కాసిపేట మండలంలో 152వ  గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీ జయంతి జరుపుకున్నారు. దేవాపూర్ గ్రామంలో కాసిపేట మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని పెద్దనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ పంచాయతీ సిబ్బంది సేవలకు గాను శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై గ్రామ సభ ఏర్పాటు చేసి 2021-22 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కాసిపేట  వారు గాంధీ మరియు లాల్ బహద్దూర్ శాస్త్రిల జయంతిని జరుపుకున్నారు. శాంతి, అహింస ల ద్వారా ఆంగ్లేయులను తరిమికొట్టి దేశానికి స్వతంత్రం సంపాదించిన మహానీయుడని కొనియాడారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App