Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కరోనా వాక్సిన్ (టీకా) కార్యక్రమం నిర్వహించి ప్రజలకు వాక్సిన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన గ్రామస్తులకు మొదటి, రెండవ డోస్ లను మొత్తం 80 మందికి వాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, పంచాయతీ వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న ఇందుమతి, బొల్లెపల్లి కొమురక్క, పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు, ఏ.యన్.యం పద్మ , అంగన్ వాడి టీచర్ వకుళాదేవి, ఆశ వర్కర్లు కాంతకుమారి, చెండే పోసు, బి.లలిత, బి సత్యవతి, కే.రమాదేవి పాల్గొన్నారు.