Digital Kasipet:-
సెప్టెంబర్ 5 ఆదివారం రోజున హైదరాబాద్ లో జరిగే విశ్వబ్రాహ్మణ మహా జన గర్జన సభను విజయవంతం చేయాలనీ కాసిపేట మండల విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ ఐక్య సంఘం నాయకులు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన అభివృద్ధి ఫలాలను సాధించడానికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చార్యులు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షులు జంబోజు కృష్ణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్, మండల కోశాధికారి సజ్జనపు ఆనందాచారి పాల్గొన్నారు.