Digital Kasipet:-
మండలంలోని గట్రావుపల్లి గ్రామంలో అసంపూర్ణంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని పూర్తిచేయాలని కాసిపేట మండల తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం గట్రావుపల్లిలో తుడుందెబ్బ నాయకులు సమావేశం అయ్యారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 2006 సంవత్సరంలో ఆరోగ్య ఉపకేంద్రం భవనం ప్రారంభించగా మధ్యలోనే ఆగిపోయిందన్నారు. గట్రావుపల్లి గ్రామ ప్రజలకు సరైన వైద్యం అందడంలేదని, గర్భిణీ స్త్రీలకు అత్యవసర వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించాల్సి వస్తుందన్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని భావన నిర్మాణాన్ని పూర్తి చేయాలనీ డిమాండ్ చేసారు.