Digital Kasipet:-
రేషన్ దుకాణంలో రేషన్ డీలర్ సమయపాలన పాటించకుండా ఇస్తానుసారంగా వ్యవహారిస్తున్నారని స్థానిక ప్రజల ఇచ్చిన సమాచారం మేరకు మండల తుడుందెబ్బ నాయకులు ఆదివారం సోనాపూర్ జీపీ పరిధిలోని రేషన్ దుకాణన్ని సందర్శించారు. నాయకులు మాట్లాడుతూ రేషన్ డీలర్ ని వివరణ అడగగా సరిగ్గా సిగ్నల్ రాక ఇబ్బందిగా ఉందంటూ పొంతన లేని సమాధానం చెప్తున్నట్లు తెలిపారు. గట్రావుపల్లి ప్రాంతం నుండి రేషన్ దుకాణనికి రావడానికి 7,8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని, డీలర్ సమయానికి రాకపోవడంవల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన గట్రావుపల్లి గ్రామానికి ప్రత్యేకంగా రేషన్ దుకాణం మంజూరు చేయాలనీ కోరారు.