Digital Kasipet:-
మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. స్టేషన్ లోని గదులను పరిశీలించి రికార్డలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు జరగకుండా పకడ్బంది నిఘా ఏర్పాటు చేయాలని, సిబ్బందిని పెంచి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఎసిపి ఏం. ఏ రహెమాన్, మందమర్రి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ప్రమోద్ రావు , ఎస్.ఐ సంజీవ్, భూమేష్, విజేందర్ ఉన్నారు.