Digital Kasipet:-
మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేం సాగర్ రావు 62వ జన్మదిన వేడుకలు మంగళవారం కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా ధర్మారావుపేట రామాలయంలో పూజలు నిర్వహించగా, దేవాపూర్ గ్రామంలో మొక్కలను నాటారు. బెల్లంపల్లి పద్మశాలి భవన్ లో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు 60 మంది రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ధర్మారావు పేట యంపిటిసి పార్వతి మల్లేష్, సీనియర్ నాయకులు మెరుగు శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భారతాని సతీష్, పెద్దనపల్లి ఉప సర్పంచ్ సోమని రాజం మైసక్క, షాకీర్, వేణు, మైదం రమేష్, జాడి శివ, గాదం గట్టయ్య, పెద్దనపల్లి గ్రామ వార్డు సభ్యులు పంబాల తిరుపతి, కొత్త రమేష్, నాయకులు చిలుకయ్య, నర్సయ్య, సోమని రాజం, చెండె నవీన్, రాజు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.