Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సీనియర్ జర్నలిస్ట్ మనోహర స్వామి కి ఘన సన్మానం

Digital Kasipet:- 
పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించి ప్రెస్ క్లబ్ నుండి విరమణ పొందిన సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రభ మాజీ రిపోర్టర్, ప్రస్తుత పీసీడబ్ల్యూ ఛానల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తిరుణహరి మనోహర స్వామిని కాసిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా  శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చెట్టి శ్రీధర్  సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు స్వామి తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అనంతరం దేవాపూర్  ఓరియంట్ సిమెంట్ కంపెనీ హెచ్ఆర్ శాఖ అధికారి తంగళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల పాత్ర సమాజంలో కీలకమైందని, వారి సేవలు వెళ్లకట్టలేనివన్నారు. సన్మాన గ్రహిత తిరుణహరి మనోహర స్వామి మాట్లాడుతూ కాసిపేట మండలంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్ట్ గా కాసిపేట ప్రెస్ క్లబ్ సభ్యుడిగా తన కు ఉన్న బంధం, స్నేహాన్ని ఎప్పడికి మర్చి పొనన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్ట్ లు ఎరుకల లింగస్వామి, టంగుటూరి రవి రాజ్, కూకట్ల రాజేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, కమటం తిరుపతి, చెట్టి శ్రీధర్, లడ్డూరి రమేష్ కుమార్, గంధం దినేష్, మారం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App