Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, చింతగూడ గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ పంటలను పరిశీలించారు. పత్తి, కంది, వరి పంటలో వచ్చే వివిధ తెగుళ్ల నివారణ గురించి వివరించారు. పత్తి చెల్లో నిలిచిన నీళ్లను తొలగించి సిఫారసు చేసిన మొతదుకు 10 - 15 కేజీల యురియా పోటాష్ ను అదనంగా వేయాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి వందన, ఏఈవో శ్రీధర్, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.