Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహనా

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, ధర్మరావుపేట  రైతు వేదికలలో రైతులకు పంట మార్పిడి విధానం పై వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రకం పంట వేయడం వల్ల నష్టం వస్తుందని, యాసంగిలో  కంది, శనగ, పెసర, మినుము, జొన్న వేరుశనగ పంటలను వేయాలని అన్నారు. బెల్లంపల్లి ఏడిఏ సురేఖ మాట్లాడుతూ 30 - 40 శాతం పంట మార్పిడి చేయాలని, వరి కాకుండా నువ్వులు, చిరుధాన్యలు, ఇతర పంటలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, దుర్గం పోశం, గోడిశేల భీమయ్య, మండల వ్యవసాయ అధికారి వందన, ఏఈఓ శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App