Digital Kasipet:-
గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గురువారం కాసిపేట ఎస్ఐ నరేష్ గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకోవాలని అన్నారు. విగ్రహాన్ని ప్రతిష్టించే గణేష్ మండలి నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్ ద్వారా పోలీస్ శాఖ వారికి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం, నిబంధనలు అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.