Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సుద్దాల వాగులో వరద ఉదృతి... ప్రజల కష్టాలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో  మారుమూల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమగూడెం - పెద్దనపల్లి మధ్య గల సుద్దాల వాగు ప్రవాహం పెరగడంతో అత్యవసర పరిస్థితులలో వాగు దాటి వెళ్లలేని దుస్థితి నెలకొంది. గతంలో ప్రజలు వాగు దాటే సమయాల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు నూతన బ్రిడ్జి ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App