Digital Kasipet:-
సెప్టెంబర్ పోషన మాసం పురస్కరించుకొని కాసిపేట మండలంలోని ముత్యంపల్లి సంగీత అంగన్వాడీ కేంద్రంలో పోషక వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబెర్ సిరాజ్ ఖాన్ మాట్లాడుతూ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా రక్తహీనత ఉన్నవారికి పౌష్టిక ఆహారం అందిస్తుందని అన్నారు. బాలింతలకు, గర్భిణీలు పౌష్టికహారం తీసుకోవడంలో సలహాలకొరకు అంగన్వాడీ టీచర్ లను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.