Digital Kasipet:-
స్టార్ హెల్త్ హాస్పిటల్ మంచిర్యాల వారిచే కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రొడ్డ లక్ష్మీ , జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపిపి పుస్కూరి విక్రంరావు, ఎంపిటిసి అక్కెపెల్లి లక్ష్మి, సర్పంచ్ బాదు, ధారావత్ దేవీ, ఉప సర్పంచ్, బోయిని తిరుపతి, పిట్టల సుమన్, పానగంటి అశోక్, తెరాస నాయకులు మొటూరి వేణు, మద్దెవెని వేణు, మల్లెత్తుల సందీప్, మెర్గు శ్రీనివాస్, అక్కెపల్లి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.