Digital Kasipet:-
మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాసిపేట మండలం బుగ్గగుడెం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు, పంట పొలాలు నీట మునిగాయి. ఇండ్లలోకి కూడా నీళ్లు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.