Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన భీంరావు ఆదివారం హైదరాబాద్ నిజాంపేట్ లోని SLV అకాడమీ లో జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మెన్స్ విభాగంలో విజేతగా నిలిచారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మన మండలానికి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు శంకర్, కనకరాజు, అన్నం కుమార్, షాకీర్ , రశిద్, వేణు, గసికంటి మల్లేష్, ఖాదిర్ ఖాన్, జుగునాక తిరుపతి గ్రామ పటేల్ లు పాల్గొన్నారు.