Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం మండల స్థాయి లేడీస్ టైలర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లేడీస్ టైలర్స్ నిర్వాహకులు ఎదుర్కొoటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రస్తుత పరిస్థితులతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా టైలరింగ్ వృత్తి పనుల ధరలు నిర్ణయించడంపై చర్చించి పలు తీర్మాణాలు చేశారు. అనంతరం కాసిపేట మండలంలోని లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాసిపేట మండల లేడీస్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షరాలిగా పెద్దపెల్లి శ్రీవాణి, ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి పుష్పలత, కోశాధికారిగా కోట రమాదేవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల లేడీస్ టైలర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.