Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

Digital Kasipet:- 
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, గ్రామ రైతులు, గ్రామ సంఘాలు పాల్గొన్నారు. ముత్యంపల్లి TGB బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్ భీమా యోజన ద్వారా సంవత్సరానికి 330 చెల్లించడం తో అనుకోకుండా సాధారణ మరణం పొందితే 2 లక్షల రూపాయలు అలాగే సంవత్సరానికి 12 రూపాయలు చెల్లిస్తే  ప్రమాద భీమా క్రింద 2 లక్షల రూపాయలు అందుతాయాన్నారు. ఇవి రెండూ కలిపి 4 లక్షల రూపాయలు అందుతాయని, కాబట్టి ప్రతీ ఒక్కరూ కట్టుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ మోసాలు చాల జరుగుతున్నాయి ఎవరైనా బ్యాంకు మేనేజర్ పేర్ల మీద ఫోన్ కాల్స్ చేస్తే నమ్మొద్దని, ఏ సమాచారమైన నేరుగా బ్యాంకులో కలిసి తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మైసక్క, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఆశీష్ , ఐ.కే.పి సిబ్బంది భాస్కర్, లక్ష్మీ, భూనేని రాజు, నగేష్ గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం  బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్, సర్పంచ్ వేముల కృష్ణ లను మహిళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App