Digital Kasipet:-
తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాది వేసిన కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. జయంతి సందర్బంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా కోశాధికారి మండే మంతయ్య, తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్, కోశాధికారి కనక వంశీ కృష్ణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆత్రం జంగు, కో కన్వీనర్ చిక్రం రాందాస్, కార్యదర్శి అట్లా మల్లేష్, ముత్యంపల్లి జిపి అధ్యక్షులు కనుకుంట్ల హరీష్, గట్రావుపల్లి జిపి అధ్యక్షులు ఆత్రం లింగు, పల్లంగూడ అధికార ప్రతినిధి నవ్వనందుల శ్రీహరి, జాగృతి సభ్యులు దాసరి రాజన్న, గేడం లక్ష్మణ్, మారం కుమార్ పాల్గొన్నారు.