Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపేలా పనిచేయాలని సామాజిక చైతన్య వేదిక నిర్ణయం తీసుకుంది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సామాజిక చైతన్య వేదిక ముఖ్య సభ్యులు సమావేశమై గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తీర్మానించారు. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాల్లో భాగంగా మూఢనమ్మకాల పై సాంస్కృతిక కార్యక్రమాలు, మహనీయుల జన్మదిన కార్యక్రమాలు, చరిత్రలో మను వాదుల కుట్రల వల్ల కనుమరుగైన బహుజన పోరాటయోధుల జీవిత విశేషాలు ఈతరం వారికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ కమిటీల ఏర్పాటు తో పాటు అంబేద్కర్ పూలే ఆలోచన విధానాలను ప్రచారం చేయడం, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు, బహుజనుల ఐక్యతకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ఉపాధ్యక్షులు మేరుగు శంకర్, గొడిసెల రాజేశం, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, ప్రధాన సలహాదారు చిన్న భీమయ్య, సామాజిక చైతన్య వేదిక యూత్ అధ్యక్షుడు కలవల శ్రీను, సభ్యులు బన్న లక్ష్మణ్ దాస్, మడావి తిరుపతి, ఎం రాజన్న తదితరులు పాల్గొన్నారు.