Digital Kasipet:-
ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో చొప్పరిపల్లి, సోమగూడెంకు చెందిన దుగుట వెంకటరమణ రాయల్ ఎన్ఫీల్డ్ పాత బెల్లంపల్లి X రోడ్డు వద్ద అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. బండిపై అతను, అతని స్నేహితుడు మంగ సాయి రిషి లు కలిసి బెల్లంపల్లి వైపునుండి సోమగూడెం కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలవగా వెంటనే 108 అంబులెన్సు ద్వారా బెల్లంపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల మహర్షి ఆస్పత్రికి తరలించగా, చికిత్స జరుగుతుండగా మంగ సాయి రిషి మృతి చెందాడు. మోటారు సైకిల్ నడిపిన దుగుట వెంకటరమణకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుని మేనమామ బబ్బెర రవికుమార్ ఫిర్యాదు మేరకు కాసిపేట ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.