Digital Kasipet:-
కాసిపేట మండలం లంబాడితండా (డి) గ్రామపంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మారపు ప్రశాంత్, శేధం శివకుమార్ ఇద్దరు గురువారం సాయంత్రం యాప కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా పాలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మారపు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని దేవాపూర్ ఎస్ఐ విజయేందర్ పరిశీలించారు. మృతదేహాన్ని బెల్లంపల్లి కెమికల్ హాస్పటల్ కి తరలించారు. శేధం శివకుమార్ కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం మంచిర్యాల కి, అక్కడినుండి హైదరాబాద్ కి తీసుకెళ్లినట్లు సమాచారం.