Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో శుక్రవారం రాజీవ్ గాంధీ 77 వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఇప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే అప్పటి రాజీవ్ గాంధీ దీర్ఘకాలిక ఆలోచనలు, వ్యూహాలతోనే సాధ్యమైందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం జరిగిందని, ఈరోజు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే ఆయన చలవే అని అన్నారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు తన ఆశయాలు కొనసాగాలంటే దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాని చేసి, కాంగ్రెస్ పార్టీ ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, గోలేటి స్వామి, కూకట్ల దేవెందర్, మైదం రమేష్, జాడి శివ, నస్పూరి నర్సింగ్, మల్లెత్తుల రాజేశం, పులగం వెంకన్న, ప్రూధ్వీ , క్రాంతి, నలిగేటి శంకర్, నరెందర్, రాజు పాల్గొన్నారు.