Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో రఘుపతి రావు ఛారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలో కరోనా సమయంలో సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి దుస్తులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రస్ట్ కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గోని మాట్లాడుతూ కోవిడ్ 19 సమయంలో ధైర్యంగా సేవలు అందించిందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, సర్పంచ్ వేముల కృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెంట రజిత,రొడ్డ శారద, యూత్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు మహేందర్,యంపిటిసి పార్వతి మల్లేష్, తొంగల మల్లేష్, గోలేటి స్వామి, అన్నం కుమార్, రాజు, రమేష్, శివ, షాకీర్ లు పాల్గొన్నారు.