Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో సోమవారం మంచిర్యాల జిల్లా తుదేందెబ్బ ఆధ్వర్యంలో కాసిపేట మండల తుడుందెబ్బ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు. కాసిపేట మండల తుడుందెబ్బ అధ్యక్షులుగా ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శిగా మడావి వెంకటేష్, కోశాధికారిగా పెంద్రం ప్రభాకర్ తదితరులను ఎన్నుకున్నారు. గతంలో కాసిపేట తుడుందెబ్బ కమిటీకి సేవలందించిన కనక రాజుని సన్మానించి మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి ఆడ జంగు, సోయం జంగు నియామక పత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మడావి వెంకటేష్, వర్కింగ్ ప్రసిడెంట్ పెంద్రం హనుమంతు,జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, మంచిర్యాల జిల్లా ఆదివాసీ విద్యార్ధి సంఘం అధ్యక్షులు వెడ్మ కిషన్ తదితరులు పాల్గొన్నారు.