Digital Kasipet:-
కాసిపేట మండలం సాలెగూడలో గ్రామంలో గురువారం గ్రామస్తులు వర్షం కోసం గ్రామ దేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా వర్షం సరిగ్గా పడకపోవడంతో మహిళలు, యువకులు అందరు కప్పను రోకలి తో కట్టి నీళ్లు పోస్తూ ఉరేగింపులు చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సిడాం జైతు, సీడం గణపతి, పెంద్రం ప్రభాకర్, మడావి మనికేరావు, పర్వతిబాయ్, జంగుబాయి, కమలబాయి, దుర్గుబాయ్ తదితరులు పాల్గొన్నారు.