Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మామిడిగూడెంలో కార్డెన్ అండ్ సర్చ్.. 12 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు సీజ్

Digital Kasipet:- 
మంచిర్యాల  జిల్లా కాసిపేట మండలంలోని మామిడి గూడెం  గ్రామంలో బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్  ఆధ్వర్యంలో 51 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి ఆకస్మికంగా కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 12 మోటార్ సైకిల్స్, 3 ఆటోలను సీజ్ చేశారు. 11 కలప దుంగలు, 5 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుడుంబాను ఎక్సైజ్ శాఖకు, కలపను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ రెహమాన్ గారు మాట్లాడుతూ ప్రజల రక్షణకు నేరాల నిర్మూలనకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు, బెల్లంపల్లి రూరల్ సీఐ రాజు, డివిజన్ ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App