Digital Kasipet:-
కాసిపేట గ్రామంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ సిరిసిల్ల రాజయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 9 న ఇంద్రవెల్లి లో నిర్వహించబోయే దళిత గిరిజన దండోరాను ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. సమావేశం అనంతరం సిరిసిల్ల రాజయ్య కు కాంగ్రెస్ స్థానిక నాయకులు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, మెరుగు శంకర్, పార్వతి మల్లేష్, మైదం రమేశ్, జాడి శివ, SC సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, కనక రాజు, షాకిర్, అన్నం కుమార్, గోపు శ్రీను, NSUI జిల్లా అధ్యక్షులు ఆదర్శ్, నియోజక వర్గ యువజన నాయకులు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.