Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి మరియు చిన్నాధర్మారం గ్రామాలలో మేకలు, గొర్రెలకు కాసిపేట పశువైద్యాధికారి తిరుపతి ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేసారు. శుక్రవారం 1200 మేకలు, 2400 గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేసినట్లు డా. తిరుపతి తెలిపారు. నట్టల మందు తాగించడం వల్ల జీవాలకు కలిగే లాభాలను గొర్రెల కాపరులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి కాసిపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, ముత్యంపల్లి సర్పంచ్ అడే బాదు, TRS నాయకులు రొడ్డ రమేష్, గొర్రెల కాపరులు మరియు పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.