Digital Kasipet:-
కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మడావి విజయ వేంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రేగులగూడ గ్రామ పటేల్ కుర్సెంగా సోనేరావు చేతుల మీదుగా ఆదివాసీ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. గిరిజనుల యొక్క హక్కులు, చట్టాలను గుర్తించాలని, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలను, జీవించే హక్కును కాపాడాలని పలువురు నాయకులు గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలను కాలరాస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో కోమటిచెను సర్పంచ్ రాంటెంకి శ్రీనివాస్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, పర్ధాన్ పురోహిత్ సేవ సంఘం మండల అధ్యక్షుడు కుర్సెంగా సోనేరావు, ఆదివాసీ నాయకులు పెంద్రం శంకర్, కుర్సెంగ వసంత రావు, కొడప ఆనంతరావు, కనక వంశీకృష్ణ, గేడం శేఖర్ మరియు మండల జాగృతి అధ్యక్షుడు సోదరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.