Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల పహాడ్ గ్రామానికి వెళ్లే మార్గంలో వాహనాలకు, కాలినడకన వెళ్ళేవారికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పైకి అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై నరేష్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ భోయిని తిరుపతి మరియు ముత్యంపల్లి యువత పాల్గొన్నారు.