Digital Kasipet:- కాసిపేట మండలంలోని సోమగూడెం ట్యాంక్ బస్తీలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు.